దినచర్య

ఉదయం

6.45 సమాధిహాల్‌లో క్షీర సమర్పణ

7.00 టిఫిన్‌

10.00 ఉదయం పూజ

11.30 మధ్యాహ్న భోజనం

మధ్యాహ్నం

4.00 టీ, తమిళ పుస్తక పఠనం

4.30 ఇంగ్లీష్‌ పుస్తక పఠనం

5.00 వేద పారాయణ

6.15 సాయంకాల పూజ

6.30 తమిళ పారాయణ

7.30 రాత్రి భోజనం

9.00 సమాధి మందిర దర్శనం నిలిపివేత

ప్రధాన పర్వాలు

శ్రీభగవాన్‌ జయంతి

డిసెంబర్‌-జనవరిలో వేలాది భక్తుల సమావేశంలో విస్తృతమైన పూజలు, సంగీత కచ్చేరీలు విస్తారమైన అన్న వితరణతో కడువేడుకగా జరుగుతుంది.

పొంగల్‌

జనవరి 13-15 సమయంలో జరుపుకునే సంక్రాంతి పండుగ, తరువాత రోజున పశువులను పూజించే మాట్టు పొంగల్‌.

శ్రీవిద్యా హవనం

జనవరి-ఫిబ్రవరి కాలంలో శ్రీమాతృభూతేశ్వరాలయంలోని శ్రీచక్రానికి నవ్యతేజాన్ని సమీకరించే హోమం రోజంతా జరుగుతుంది.

మహాశివరాత్రి: ఫిబ్రవరి-మార్చిలో వస్తుంది. పరమశివుడు భూమిపై అరుణాచలంగా ఆవిర్భవించిన సందర్భం. షట్కాల పూజలు, వేదపారాయణలు, విశేష అభిషేకాలు, ఉపవాస-జాగరణలు, గిరి ప్రదక్షిణ, భక్తుల సందోహంతో మహాకోలాహలంగా ఉండి కైలాసం దిగివచ్చిందా అనిపిస్తుంది.

భగవాన్‌ ఆరాధన: ఏప్రిల్‌-మే లో వచ్చే రమణుల నిర్వాణదినం. సమాధికి ప్రత్యేక పూజాభిషేకాలుంటాయి

ఆగమన దినం

సెప్టెంబర్‌ 1

బాలుడైన వేంకట్రామన్‌ మధుర వీడి సాహసయాత్ర చేసి అరుణాచలంలో అడుగుపెట్టిన రోజు.

దేవీ నవరాత్రి

తొమ్మిది రాత్రుల మాతృ పూజోత్సవం. ప్రతిరోజూ విశేష అర్చనలు, సాయంకాల ప్రత్యేక అలంకారాలు. విజయదశమినాడు ఊరేగింపు.

కార్తీక దీపం