శ్రీరమణాశ్రమంలో వసతి కోసం సందర్శకులు stay@sriramanamaharshi.org ఎడ్రెస్‌కు, తమ ప్రయాణానికి ఒక నెల ముందుగా రాసి అనుమతి పొందవలసి ఉంది. వ్యక్తులకు, దంపతులకు, కుటుంబాలకు వేర్వేరుగా వసతులు కల్పిస్తారు. టేబుల్‌, కుర్చీ, మంచం, అల్మారాలతో, అటాచ్డ్‌ బాత్‌రూంలతో, శీతాకాలంలో వేడినీళ్ళతో సదుపాయంగా ఉంటాయి.
సాధారణంగా ఇడ్లీ-కాఫీతో బ్రేక్‌ఫాస్ట్‌; దక్షిణభారత భోజనం – అన్నం, కూర, సాంబార్‌, రసం, మజ్జిగలతో మధ్యాహ్నం, రాత్రి లభిస్తుంది. మధ్యాహ్నం, టీ-పాలు ఉంటాయి. ఫిల్టర్‌ చేయబడిన రక్షిత మంచినీరు; అవసరాన్ని బట్టి వైద్యసదుపాయాలు కల్పించబడతాయి.
సందర్శకులకు సామాన్యంగా 3 రోజుల వరకు అనుమతి ఉంటుంది. ఎక్కువకాలం ఉండటానికి అనుమతి లేదు. వసతి నిర్ణయం పూర్తిగా యజమాన్యానిదే.
కొండపైన, క్షేత్ర సంబంధ ప్రదేశాలు, రమణుల జీవితానికి సంబంధించిన స్థలాలు చూడడానికి ఆశ్రమ కార్యాలయంలో సంప్రదించవచ్చును. ఎట్టి విషయంలోను ఆశ్రమం బయట మధ్యవర్తులను నమ్మవద్దు.
ప్రచురణలు
పుస్తకాలు
సి.డి, డి.వి.డిలు.